ETV Bharat / state

సీఎం జగన్ పాలన అశోకుడు, అక్బర్ చక్రవర్తుల తరహాలో ఉంది

author img

By

Published : Feb 20, 2020, 12:02 AM IST

సీఎం జగన్ పాలన అశోకుడు, అక్బర్ చక్రవర్తుల తరహాలో ఉందని కర్నూలు ఎంపీ డాక్టర్​ సంజీవ్ కుమార్ కొనియాడారు. అభివృద్ధి వికేంద్రీకరణతో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని కర్నూలు జిల్లా వైకాపా నేతలు అన్నారు.

ysrcp leaders talked about Development decentralization at karnool
కర్నూలులో వైకాపా నేతల మీడియా సమావేశం
కర్నూలులో వైకాపా నేతల మీడియా సమావేశం

అభివృద్ధి వికేంద్రీకరణతో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని కర్నూలు జిల్లా వైకాపా నేతలు అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కర్నూలు చాలా వెనుకబడిందని .. న్యాయ రాజధాని ఏర్పాటు వల్ల అభివృద్ధి చెందుతుందని ఎంపీ డా. సంజీవ్ కుమార్ అన్నారు. గత తేదేపా ప్రభుత్వం కర్నూలులో కనీసం తాగునీటి సమస్యను తీర్చలేదని మండిపడ్డారు. కృష్ణానది ద్వారా వేల టీఎంసీలరు దిగువకు వెళ్తున్న కర్నూలు వద్ద 1 టీఎంసీ నీరు దాచడానికి కూడా అవకాశం లేదన్నారు. సీఎం జగన్ పాలన అశోకుడు,అక్బర్ చక్రవర్తుల తరహాలో ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడటానికి అభివృద్ధి వికేంద్రీకరణను సీఎం చేపట్టారని .. దీన్ని తెదేపా వ్యతిరేకించడం తగదని ఎంపీ బుట్టారేణుక ధ్వజమెత్తారు. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీచూడండి.సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.