ఆదోనికి చెందిన తెదేపా నాయకుడు రంగన్నకు సంబంధించిన పది ఎకరాల పొలంలోని కొబ్బరి, ఎర్రచందనం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. వీటి విలువ 40 లక్షల వరకు ఉంటుందని.. బాధితుడు తెలిపాడు. ఎన్నికల్లో తాను తెదేపా అభ్యర్థులకు మద్దతుగా నిలిచానని.. వైకాపా నాయకులు తనని నేరుగా ఎదుర్కొలేక ఇలా ఆస్తి నష్టం కలిగించారని బాధితుడు ఆరోపించాడు.
నిన్న ఎన్నికల జరుగుతున్న సమయంలో పొలంలో నిప్పు పెట్టారని.. దృష్టి మరల్చేందుకే అధికార పార్టీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడారని విమర్శించాడు. బాధితుడిని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పరామర్శించారు. ఆదోని నియోజకవర్గంలో ఎప్పుడు ఇలా జరగలేదని.. ఆర్థికంగా దెబ్బ కొట్టడం మంచిది కాదని మీనాక్షి నాయుడు అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండీ.. విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు