కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నపురం గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు ఓ యువతిని.. ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. రమేష్ పెళ్లి చేసుకుంటానని.. పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం కూడా రాశాడని బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలా చేస్తే పోలీసులను ఆశ్రయించానని... వారు కేసు నమోదు చేశారని బాధితురాలు తెలిపింది. కేసు ఉపసంహరించుకుంటే పెళ్లి చేసుకుంటానని రమేష్ నమ్మించాడని.. మళ్లీ మోసం చేసి పరారయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: