ETV Bharat / state

బైరెడ్డి సిద్ధార్థ్​రెడ్డితో విభేదాలపై ఆర్థర్ స్పష్టత - నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వార్తలు

నందికొట్కూరు వైకాపాలో విభేదాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ బాధ్యుడు బైరెడ్డి సిద్ధార్థ్​ రెడ్డి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. వీటిపై ఎమ్మెల్యే ఆర్థర్ స్పందించారు.

bireddy siddarth reddy
bireddy siddarth reddy
author img

By

Published : Mar 7, 2020, 5:32 AM IST

మీడియాతో ఎమ్మెల్యే ఆర్థర్

బైరెడ్డి సిద్ధార్థ్​ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. 'కొంతమంది విడదీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ నేను ఎప్పుడూ ఎవరినీ విమర్శించలేదు' అని ఆయన చెప్పారు. మరోవైపు తాను చెప్పిన వ్యక్తికి నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మెన్ పదవి రాకపోవటంతో బాధపడిన మాట వాస్తవమేనని ఆర్థర్ తెలిపారు. తాను చెప్పిన వ్యక్తికి గతంలో ఛైర్మెన్ పదవి వచ్చిందని, మూడు నెలల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులు రద్దు చేసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులకు ఛైర్మెన్ పదవి ఇచ్చారని వాపోయారు. కొత్త ఛైర్మెన్ ప్రమాణ స్వీకారానికి అధికారులు పిలువలేదని, ఒక వేళ పిలిచి ఉంటే వెళ్లి ఉండేవాడినని స్పష్టం చేశారు. ఈ విషయాన్నిపెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఇదీ చదవండి

'మనమున్నది ప్రజాస్వామ్యంలోనా.. నియంత రాజ్యంలోనా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.