కర్నూలు జిల్లా ఆదోనిలో భాజపా కార్యకర్త కేశవ్పై దాడి జరిగింది. వైకాపా నాయకుడు హులిగప్పే తనపై దాడి చేసి గాయపరిచినట్టు బాధితుడు ఆరోపించాడు. ఇంటి పట్టా మంజూరు చేసే విధంగా చూడాలని హుళిగప్పను కోరగా.. భాజపా కార్యకర్తలకు పట్టా రాదంటూ దాడి చేశాడని చెప్పాడు. కేశవ్ ఆదోని ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఇందిరమ్మ గృహాలున్న వారికి పట్టా మంజూరు చేసి.. భాజపా కార్యకర్తనన్న వంకతోనే తనకు ఇల్లు రాదని చెప్పడం విడ్డూరమని అతను వాపోయాడు.
ఇదీ చదవండి: