సీఏఏకు వ్యతిరేకంగా మహిళల ధర్నా - muslim womens dharna news in Kurnool
కర్నూలులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.