కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పెసలదిన్నెలో షేక్ ఉసేన్ బీ(22) వివాహమైన నాలుగు నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ.. నొప్పి తాళలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామీణ ఎస్సై రామసుబ్బయ్య తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉసేన్ బీని కల్లూరు మండలంలోని తడకనపల్లెకు చెందిన మహబూబ్ బాషాకు ఇచ్చి వివాహం జరిపించారు. చికిత్స కోసం పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు