అప్పు చెల్లించడంలో జాప్యం చేసిన ఓ మహిళను ఇంటికి పిలిచి నిర్బంధించిన ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో జరిగింది. నంద్యాల విస్వాసపురానికి చెందిన విజయకుమారి అనే మహిళ తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకొంది. డబ్బులు ఇవ్వాలని వెంకటేశ్వర్లు ఒత్తిడి చేయడంతో విజయకుమారి ఇంటికి వెళ్ళింది. అక్కడ కొంతమంది వ్యక్తులు తోడై డబ్బులు ఇచ్చే దాక బయటకు వదిలేది లేదంటూ గదిలో నిర్బంధించారు. రూ.8 లక్షలు అప్పు ఉన్నట్లు ఖాళీ ప్రామిసరీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: