ETV Bharat / state

'సీఐ నుంచి ప్రాణహాని ఉంది.. నన్ను రక్షించండి'

సీఐ నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ మహిళా కానిస్టేబుల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఘటన కర్నూలులో జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె ఆందోళన చేపట్టారు.

woman conistable dharna in kurnool collectorate office
ఉసేనమ్మ, మహిళా కానిస్టేబుల్
author img

By

Published : Jul 17, 2020, 11:48 AM IST

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళా కానిస్టేబుల్ ధర్నాకు దిగారు. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్​లో ఉసేనమ్మ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. తనను ఆత్మకూరు సీఐ గుణశేఖర్ లైంగికంగా వేధించాడని ఈనెల 15న జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసు విచారణలో ఉండగా సీఐ తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఉసేనమ్మ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. సీఐ నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

'నేను నా కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్నాను. ఇదే అదనుగా భావించి సీఐ గుణశేఖర్ నన్ను లైంగికంగా వేధించాడు. నా వద్ద అనేకసార్లు డబ్బు కూడా తీసుకున్నాడు. దీనిపై నేను ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఆ కేసు విచారణలో ఉండగా నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నన్ను, నా కుమారుడిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను.' -- ఉసేనమ్మ, మహిళా కానిస్టేబుల్

ఇవీ చదవండి...

'భవనంపై నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించు..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.