కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో ఈ నెల 25న దారుణ హత్య జరిగింది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల విచారణలో భార్యే వేట కొడవలితో భర్తను నరికి చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. దివ్యాంగురాలైన కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు భార్యకు తెలిసింది. ఈ విషయంపై కోపం పెంచుకున్న నిందితురాలు పొలంలో వేట కొడవలితో భర్తను నరికి చంపిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి వేటకొడవలి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: