ETV Bharat / state

దారుణం.. భార్యను నరికి చంపిన భర్త - క్రిష్టిపాడులో భార్యను చంపిన భర్తక్రిష్టిపాడులో భార్యను చంపిన భర్త వార్తలు

వాళ్లు వృద్ధ దంపతులు. దాదాపు 50 ఏళ్లు కలిసి కాపురం చేశారు. ఇన్నేళ్ల సంసారంలో గొడవలు, తగువులు వచ్చినా సర్దుకుపోయారు. అయితే ఇప్పుడేమైందో తెలియదు. చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవ భార్య ప్రాణాలు పోయేంత వరకు తీసుకొచ్చింది. ఆవేశంతో ఇన్నేళ్లు కలిసున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా క్రిష్టిపాడులో జరిగింది.

wife murdered by her husband in krishtipadu kurnool district
మృతిచెందిన భాగ్యమ్మ
author img

By

Published : Aug 12, 2020, 8:45 AM IST

కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం క్రిష్టిపాడులో దారుణం జరిగింది. వృద్ధాప్యంలో అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు చిన్న కారణాలతో గొడవ పెట్టుకున్నారు. అది ముదిరి భర్తే.. భార్యను హత్యచేశాడు.

గ్రామానికి చెందిన ఎలిసా, భాగ్యమ్మ భార్యాభర్తలు. అతని వయసు 70 ఏళ్లు కాగా, ఆమెకు 62 సంవత్సరాలు. ఏమైందో తెలియదు కానీ మంగళవారం ఎలిసా తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. అది తీవ్రరూపం దాల్చటంతో ఆవేశంలో కత్తితో భార్యపై దాడిచేసి పోరిపోయాడు. ఈఘటనలో భాగ్యమ్మ మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

'ఆగస్టు 21 నుంచి కరోనా డౌన్ ట్రెండ్ ప్రారంభమవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.