భర్త వేధింపుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఓ మహిళ మహిళా సంఘలను ఆశ్రయించింది. ఈ ఘటన కర్నూలులో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. తనకు 2001లో మధుసూదన్‌తో వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధితురాలు తెలిపింది. మధుసూదన్ దిశా పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, అతను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని రాధ ఆరోపించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా అతనిలో మార్పరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు కోరుతూ తనకు నోటీసులు పంపి వేదిస్తున్నాడని తెలిపారు. భర్తపై కేసు నమోదు చేసి, న్యాయం చేయాలని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: