కర్నూలు జిల్లాలో జగనన్న పచ్చతోరణం కింద ఇప్పటికే 329 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటారు. కిలో మీటర్‌కు రోడ్డుకు రెండు వైపులా 400 మొక్కలు నాటారు. గుంత, ఎరువు, రక్షణ కంచె, నీళ్లు, పర్యవేక్షణ అన్ని కలుపుకుని కిలోమీటరు కు రూ.లక్ష చెల్లించారు. ఇలా ఇప్పటి వరకు 3.92 కోట్లు చెల్లింపులు జరిగాయి.
ఆలూరు పరిధిలోని ఎల్లార్తి నుంచి హోలగుంద వరకు 10కిలోమీటర్లు మొక్కలు ఎండిపోయాయి. అలాగే ఆస్పరి, గూడూరు, కౌతాళం, గడివేముల ఇలా పదుల సంఖ్యలో కిలోమీటర్లు దూరంలో మొక్కలు ఎండుముఖం పట్టాయి.
నీళ్లు పొసే నాధుల్లేకపోవడంతో కోట్లు ఖర్చు చేసి నాటుతున్న మొక్కలు చనిపోతున్నాయి. డ్వామా నర్సరీలు, సోషల్ ఫారెస్ట్ నర్సరీలు కాకుండా ప్రైవేట్‌గా ఒక్కో మొక్కబ్ రూ. 98 చొప్పున కొనుగోలు చేశారు. 6 అడుగుల ఈ మొక్కలు సైతం ఎండి పోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకర్లుతో నీటిని పోయాలని, లేదా స్థానిక సర్పంచులకు బాధ్యతలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: KRMB: ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ భేటీ వాయిదా