ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్​ఏ భర్త ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా వీఆర్​ఏ భర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వీఆర్వో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు చెప్పారు.

a man suicide attempt in front of mro office
తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏ భర్త ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 26, 2021, 9:48 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్.కృష్ణాపురం గ్రామానికి చెందిన వీఆర్ఏ కుమారి భర్త రమణ.. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడారు. గ్రామ వీఆర్వో గోవిందరెడ్డి.. ఓ భూమి కొలతల విషయంలో తనను వేధిస్తున్నాడని రమణ ఆరోపించారు. జీతం నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు.

అయితే... మహిళా వీఆర్​ఏ స్థానంలో ఆమె భర్త రమణ విధులు నిర్వర్తిస్తున్నట్లు ఈ ఘటన ద్వారా బయటపడింది. ఈ రెండు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రమేశ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి.

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.