కర్నూలు జిల్లాలోని ఈఎస్ఐ ఆస్పత్రులు అవినీతికి నెలవుగా మారుతున్నాయి. వైద్య సేవలు సైతం తూతూమంత్రంగా అందుతున్నాయి. రోగుల సంఖ్య తగ్గిపోతున్నా...ఇష్టానుసారంగా మందులు సరఫరా, కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం ఈఎస్ఐ డిస్ఫెన్సరీలు 7, ఈఎస్ఐ ఆస్పత్రి ఒకటి ఉన్నాయి. ఆదోనిలో 2 డిస్ఫెన్సరీలు, ఈఎస్ఐ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టింది. 2014- 2019 మధ్య కాలంలో మందుల కొనుగోళ్ల, సరఫరా వ్యవహారం సక్రమంగా జరిగిందా? లేదా? అన్న కోణంలో తనిఖీ జరిగాయి. కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఎక్కడా ల్యాబ్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. తనిఖీల్లో డీఈఈ గుణాకర్రెడ్డి, విజిలెన్స్ అధికారి ఆర్ తిరుమలేశ్వర్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు!