బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా చేరడంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎట్టకేలకు నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా వెంకట కృష్ణుడు భాద్యతలు చేపట్టారు. అంతకుముందు కమిషనర్ గా ఉన్న భవాని ప్రసాద్ ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెంకత కృష్ణుడు తెలిపారు. ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
ఇదీ చూడండి:కూలీపోయిన ఇంట్లో కట్టల సంచులు