ETV Bharat / state

Vedavati Project Works has Stopped: నిధులివ్వక ఆగిపోయిన వేదవతి ప్రాజెక్టు.. తుప్పు పడుతున్న పైప్​లైన్లు - AP Latest News

Vedavati Project Works has Been Stalled for Four Years: అది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన జలాశయం! గత ప్రభుత్వంలో పనులు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అవే పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సీమ బిడ్డనంటూ ప్రేమ ఒలకబోసే సీఎం జగన్‌ ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. బిల్లులు చెల్లించలేదంటూ గుత్తేదారు పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. కరవు సీమ కన్నీళ్లు తుడుస్తాననే మాటే మరచిన జగన్‌ ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు

vedavati_project_works_has_stopped
vedavati_project_works_has_stopped
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 7:19 AM IST

Updated : Sep 6, 2023, 3:00 PM IST

Vedavati Project Works has Stopped: నిధులివ్వక ఆగిపోయిన వేదవతి ప్రాజెక్టు.. తుప్పు పడుతున్న పైప్​లైన్లు

Vedavati Project Works has Been Stalled for Four Years: రాష్ట్రంలో జలకళ తీసుకొస్తానంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను ఎక్కడికక్కడ గాలికొదిలేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు నీరందించేందుకు ఉద్దేశించిన వేదవతి పనులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. సీమ ముద్దుబిడ్డగా ప్రచారం చేసుకునే జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నా కరవు సీమను ఆదుకునే ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిందీ లేదు. నిర్మాణం పూర్తి చేయించిందీ లేదు. 2019లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 19 వందల 24 కోట్ల 80 లక్షల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చారు. అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 253 గ్రామాలతో పాటు రెండు పట్టణాల్లోని మొత్తం 10 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ ఎత్తిపోతల జగన్‌ నిర్లక్ష్యంతో ఎత్తిపోయింది.

Central Government on Polavaram Project రంగంలోకి దిగనున్న కేంద్రం.. పోలవరం ప్రాజెక్టుపై లోతుగా దర్యాప్తు

Project Construction for Drought Prevention in Kurnool District: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, హాలహర్వి, హొలగుంద, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలాల్లో నీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం వద్ద వేదవతి నది నుంచి నీటిని ఎత్తిపోస్తే సమస్య పరిష్కారమవుతుందనేది ప్రణాళిక. వరద రోజుల్లో ఈ నది నుంచి 8.292 TMCల నీటిని తీసుకునేందుకు వీలుగా ఈ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 3పంపుహౌస్‌లు, 2జలాశయాలు నిర్మించాల్సి ఉంది. 2.029 టీఎంసీ(TMC)ల నిల్వ సామర్థ్యంతో హాలహర్వి వద్ద ఒక జలాశయం, 1.027 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మొలగవల్లి వద్ద మరొకటి నిర్మించాలి. రెండింటి మధ్య గ్రావిటీ కాలువ తవ్వాలి. కానీ అవన్నీ పక్కనపెట్టేశారు.

Negligence on Godavari Penna Interlinking Project: ప్రాజెక్టు పేరు మారింది.. కానీ పనులు మాత్రం ముందుకు కదలడంలేదు

Vedavati Project Works has Stopped due to Lack of Funds: నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు ముందడుగు పడింది లేదు. గుత్తేదారుకు ఇప్పటి వరకు చేసిన పనులకు వంద కోట్ల రూపాయలు చెల్లించారు. ప్రాజెక్టు మొత్తానికి 4 వేల 819.54 ఎకరాల భూమి అవసరం. భూసేకరణకు సర్కారు నిధులు ఇవ్వడం లేదు. కేవలం 2 కోట్ల 97 లక్షల రూపాయలు చెల్లిస్తే 40 ఎకరాల భూ సేకరణకు వీలు ఉంటుంది. ఆ భూమి చేతికి వస్తే 21.7 కిలోమీటర్ల పొడవైన కాలువల తవ్వకం పనులు మొదలై కొంత పని ముందుకు సాగుతుంది. కానీ భూసేకరణ పూర్తి చేయకపోవడంతో 2 జలాశయాల నిర్మాణమూ పూర్తి కాలేదు.

CM Jagan Promises to Industrial Sector: వైసీపీ ఉత్తుత్తి ఉత్తర్వుల జాబితాలోకి చేరిన నీటిసరఫరా సంస్థ.. మాటలకే పరిమితమైన జగన్

Project Pipelines are Damaged: గ్రావిటీ కాలువ కోసం మట్టి తవ్వకం పనులు కొంతమేర జరిగాయి. దాదాపు 8 కిలోమీటర్ల మేర పైపులైనుల కోసం ఏర్పాటు చేశారు. అవీ కొన్ని తుప్పు పట్టి పాడయ్యాయి. పైపు పైభాగంలో ఉండే సిమెంటు ఊడిపోయి ఇనపచువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. పైపు లోపలిభాగంలో వేసిన పెయింట్‌ కోటింగ్‌ కూడా ఊడిపోతోంది. పైపుల్లో మట్టి చేరి అందులో మొక్కలు పెరుగుతున్నాయి.

Last Updated : Sep 6, 2023, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.