ETV Bharat / state

Tea: వినూత్న రుచులు.. 100 రకాల టీలు, 25 రకాల కాఫీలు..!

Tea: టీ అనగానే అల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ... ఇవే గుర్తొస్తాయి. ఇవి కాకుండా ‘అందరూ తాగేలా ఆరోగ్యాన్ని పెంపొందించే టీ రకాల్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదూ’ అనుకుందామె. అందుకోసం దేశం నలుమూలలా పర్యటించి తేయాకుల్ని సేకరించింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని అనుకున్నది సాధించింది. వినూత్న రుచులూ, పరిమళాలతో 100 రకాల టీలు, 25 రకాల కాఫీలను తయారు చేయడమే కాదు, విదేశాలకూ ఎగుమతి చేస్తోంది వల్లభనేని విద్యలత.

vallabhaneni vidyalatha
వల్లభనేని విద్యలత
author img

By

Published : May 30, 2022, 7:26 AM IST

Tea: సహజసిద్ధమైన, రసాయనాల్లేని తేనీటిని అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నా. నాకు టీ, కాఫీ అలవాటు లేదు. కానీ ఎక్కడికెళ్లినా అవి కాకుండా తాగేందుకు ఇంకేమైనా ఉన్నాయా అని వెతికేదాన్ని. మాది కర్నూలు జిల్లా మంత్రాలయం. సొంతంగా ఏదైనా చేయాలనేది నా కల. ఒక బ్రాండ్‌ను రూపొందించాలని ఉండేది. ఎంబీఏ, ఎంఏ సైకాలజీ చేసి ఉద్యోగంలో చేరా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నవీన్‌తో పెళ్లైన తర్వాత హైదరాబాద్‌ వచ్చా. ఆ తర్వాత అద్విత్‌ పుట్టాడు. 30 ఏళ్లలోపే ఏదైనా సాధించాలన్నది నా ఆలోచన. మావారూ ప్రోత్సహించారు.

పానీయాలపై ఆసక్తి అన్నాను కదా, కొత్తరకాల టీలను చేద్దామనిపించింది. వయోబేధం లేకుండా అందరూ తీసుకొనేలా, ఆరోగ్యాన్ని అందించేలా మా టీ ఉండాలనుకున్నా. అప్పటికే ఎనిమిదేళ్లగా ఓ సంస్థ హెచ్‌.ఆర్‌. విభాగంలో చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే అధ్యయనం మొదలుపెట్టా. దేశంలో అన్ని టీ తోటలకూ తిరిగా. వాతావరణం, పంట, రుచిలో తేడా, టీ పొడి తయారీ నుంచి కాయడం వరకు అన్నీ తెలుసుకున్నా. విదేశీ రకాలూ రుచి చూశా. ఏడాది తర్వాత 2017లో ‘బ్రూస్‌ అండ్‌ బ్లెండ్స్‌’ మొదలు పెట్టా. ఈ పరిజ్ఞానం సరిపోదనిపించింది. మరిన్ని నైపుణ్యాల కోసం ‘ఆసియన్‌ స్కూల్‌ ఆఫ్‌ టీ’లో ‘టీ సొమెలియర్‌’ కోర్సు చేశా. -విద్యలత

vallabhaneni vidyalatha
వల్లభనేని విద్యలత

నేను అభివృద్ధి చేసిన టీ శాంపిల్స్‌ను స్నేహితులకిచ్చేదాన్ని. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసే దాన్ని. నచ్చకపోతే మరో ఫార్ములా... ఇలా చేస్తూ వచ్చా. ఇక పూర్తి స్థాయిలో రంగంలో దిగాలని ఉద్యోగాన్ని వదిలేశా. ఒక కొత్తరకం టీ తయారీకి దాదాపు నెలన్నర పట్టేది. డార్జిలింగ్‌, అసోం, ఖాంగ్రా ఎస్టేట్స్‌ నుంచి ముడిసరుకు తెప్పిస్తుంటా. 15 రకాల టీలతో మొదలుపెట్టాను.

6 నెలల్లోనే 5 రకాల కాఫీలూ చేర్చా. ఇవన్నీ మార్కెట్‌లోకి పూర్తిగా రావడానికి ఏడునెలలు పట్టింది. సీజన్లకు తగ్గట్లు ప్రయోగాలు చేస్తుంటా. మా దగ్గర ఇప్పుడు 100 రకాల టీ, 25 రకాల కాఫీ పొడులున్నాయి. మిల్క్‌, వాటర్‌బేస్‌, వెల్‌నెస్‌ టీలతోపాటు చాలా రకాలున్నాయి. కొన్ని పొడులను మరిగే నీటిలో వేయగానే బెర్రీస్‌, బాదం పలుకులు తేలుతాయి. బ్లూమిన్‌బడ్‌ టీ క్షణాల్లో పూరేకల్లా విచ్చుకుంటుంది. కాఫీల్లో కోల్డ్‌ బ్రూ, ఇన్‌స్టెంట్‌, ఫిల్టర్‌ రకాలూ.. రెడీమేడ్‌ డికాక్షన్‌ మా ప్రత్యేకం. -విద్యలత

vallabhaneni vidyalatha success story
100 రకాల టీలు

కష్టాలూ ఉంటాయ్‌... టీతోటల వాళ్లకు అడ్వాన్సులు ఇస్తే సమయానికి సరుకు పంపక పోవడం, ఎగ్గొట్టడం చేసే వాళ్లు. వ్యాపారంలో ఇవన్నీ సహజం. కొవిడ్‌లో అమ్మకాలు తగ్గిపోయాయి. ఉద్యోగమూ లేదు, ఆదాయమూ లేదు. ఎందుకిటొచ్చాన్రా దేవుడా అనిపించింది. అప్పుడే జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. దాన్నే అవకాశంగా తీసుకుని హెర్బల్‌ టీల తయారీతో గట్టెక్కా. ఏటా దీపావళి, దసరా వంటి పండగలకు మా ఉత్పత్తులెక్కువ అమ్ముడవుతాయి.

ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగులకు మా ఉత్పత్తులను గిఫ్ట్‌గా ఇస్తుంటాయి. మా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ విక్రయిస్తాం. వెల్‌నెస్‌ సెంటర్లలోనూ మా ఉత్పత్తులుంటాయి. సున్నాతో మొదలుపెట్టి రూ.20 లక్షల ఆదాయం వచ్చే స్థాయికి చేరా. 20 మంది సిబ్బంది ఉన్నారు. సీజన్‌లో రెట్టింపు మంది పని చేస్తారు. రూ.70 లక్షల దాకా టర్నోవర్‌ ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి తదితర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం.

vallabhaneni vidyalatha success story
25 రకాల కాఫీలు

ప్రయత్నంతోపాటే... మా బాబు సంరక్షణను మా వారు, నేను చూసుకుంటాం. సమయ పాలనతో ఇంటినిని, వ్యాపారాన్ని సమన్వయం చేస్తా. మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రఖ్యాత కార్పొరేట్‌ సంస్థలు మా ఖాతాదారులుగా చేరడం, పింక్‌ పవర్‌ అవార్డుకు హైదరాబాద్‌ నుంచి 100మందికిపైగా మహిళా వ్యాపారవేత్తలు పోటీపడితే తుది జాబితాలో నేనుండటం.. లాంటి సంతోషం కలిగించే సందర్భాలు. నా లక్ష్యం దేశమంతా అవుట్‌లెట్స్‌ ఏర్పాటు.

ఒత్తిడిగా ఉంటే చిత్రలేఖనం, నృత్యం ఊరటనిస్తుంటాయి. మనకింత ఇచ్చిన సమాజానికి తిరిగి చేయాలి కదా. ‘ఎర్త్‌ లింక్స్‌’ ఎన్జీవోతో కలిసి పర్యావరణ కాలుష్య నివారణ, బాలికా విద్య వంటి అంశాలపై పనిచేస్తున్నా. ‘చేయాలి చేయాలి అనుకుంటూ ఆగిపోవద్దు. ప్రయత్నించడమే మంచిది. కాకపోతే తగిన అధ్యయనం, ప్రణాళికలతో ముందుకెళ్లండి’ అని అమ్మాయిలకు చెబుతుంటా.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.