ETV Bharat / state

హైదరాబాద్​ వాసులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. - కర్నూలు వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం రాత్రి భాజపా నేత మధు ఇంటి వద్ద ఘర్షణతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్​ వాసులపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

garshana
మద్యం బాబులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
author img

By

Published : Dec 20, 2020, 1:15 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం రాత్రి భాజపా నాయకుడు అభిరుచి మధు ఇంటి వద్ద జరిగిన ఘర్షణతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నూనెపల్లె ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న భాజపా నేత ఇంటి వద్ద హైదరాబాద్​కు చెందిన గంగుల రాజు, గుంజి మాధవ్, గుళ్లగుంట రాజు మద్యం తాగి.. ద్విచక్రవాహనంపై కూర్చోని అది తమదేనంటూ హల్​చల్​ చేశారు. అసలు వాహన యజమాని రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ముగ్గురిపై దాడి చేశారు.

దాడిలో రాజు అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అక్కడే ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరుస సంఘటనల క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘర్షణ జరిగిన ప్రదేశంలో భాజపా నాయకుడు అభిరుచి మధును వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడిలో భాజపా నేత ప్రమేయం ఉందేమోననే కోణంలో విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భార్య ఆత్మహత్య... అది తెలిసి భర్త కూడా..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.