ETV Bharat / state

'పూజల పేరుతో మహిళ మెడలో గొలుసు చోరీ' - కర్నూలు జిల్లా పూజల పేరుతో మోసం

మేము చెప్పినట్లు పూజలు చేస్తే మీకు ఆర్థికంగా కలిసొస్తుందని నమ్మబలికారు ఇద్దరు వ్యక్తులు. నమ్మిన ఆ మహిళ వారు చెప్పినట్లు చేసింది. చివరకు ఆమె కళ్లు గప్పి బంగారు గొలుసును చోరీ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా గొందిపర్లలో చోటు చేసుకున్న ఘటన వివరాలివి...!

'పూజల పేరుతో మహిళ మెడలో గొలుసు చోరీ'
author img

By

Published : Oct 20, 2019, 12:00 AM IST

'పూజల పేరుతో మహిళ మెడలో గొలుసు చోరీ'

కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పూజల పేరుతో ఓ మహిళ ధరించిన బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. గొల్ల లక్ష్మీదేవి అనే మహిళ స్థానికంగా కిరాణ దుకాణం నిర్వహిస్తోంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము చెప్పినట్లు పూజ చేస్తే ఆర్థికంగా బాగుంటుందని నమ్మబలికారు. దేవుని పటం వద్ద తమలపాకులు ఉంచి మెడలో ఉన్న బంగారు గొలుసును వాటిలో పెట్టాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన లక్ష్మీదేవి అలానే చేసింది. అనంతరం ఆమె కళ్లు గప్పి గొలుసు తీసుకుని పరారయ్యారు. గమనించిన బాధితురాలు కుటుంబసభ్యులకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి... నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

వైకాపా నేతల బెదిరింపులు... వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.