ETV Bharat / state

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - కర్నూలు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కారు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందగా... ద్విచక్రవాహనంతో డివైడర్​ను ఢీకొట్టన యువకుడు ప్రాణాలు విడిచాడు.

Two killed in separate accidents in Kurnool district
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
author img

By

Published : Jan 12, 2021, 8:17 AM IST

కారు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కర్నూలులో జరిగింది. అబ్బాస్ నగర్ వద్ద నున్న జాతీయ రహదారిపై 59 సంవత్సరాల జయలక్ష్మి అనే వృద్ధురాలిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

డివైడర్​ను ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు సమీపంలోని సంతోష్ నగర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు పయనిస్తూ... అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నగరంలోని షరీఫ్ నగర్​కు చెందిన లూర్థర్ అక్కడికక్కడే మృతి చెందగా... ధనుంజయ్, అశోక్​లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగి గంటసేపైనా అంబులెన్స్.. సంఘటన స్థలానికి రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పశ్చిమగోదావరి జిల్లాలో యువకుడు దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.