ETV Bharat / state

పిడుగుపాటుతో మహిళ మృతి... అనాథలైన చిన్నారులు - నందికొట్కూరు లో పిడుగుపాటుతో మహిళ మృతి

ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మరణించాడు. అప్పటి నుంచి కూలి పనులు చేస్తూ.. అన్నీ తానై ఇరువురు పిల్లలను తల్లి కంటికి రెప్పగా సాకుతోంది. పిడుగుపాటుకు ఇప్పుడు ఆ తల్లి సైతం బలైంది. ఈ హృదయ విదారక ఘటన.. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం గుంటూరులో జరిగింది. తల్లిదండ్రులు మృతితో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. వారి భవిష్యత్తును తలుచుకుని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

thunder bolt in nandikotkuru, two children remained as orphans
నందికొట్కూరులో పిడుగుపాటు, అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు
author img

By

Published : Apr 24, 2021, 6:15 PM IST

పిడుగుపాటుతో తల్లి మృతి చెందిన ఘటనలో ఆమె పిల్లలు అనాథలయ్యారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం గుంటూరుకు చెందిన శాంతకుమారి.. 10 బొల్లవరంలోని అక్క చింతామణి ఇంటికి వెళ్ళింది. వారిరువురూ పొలంలో కూలీలతో కలిసి పనిచేస్తుండగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం పెద్దది కావడంతో రోడ్డుపై ఉన్న ఆటో వద్దకు వస్తుండగా.. పిడుగుపాటుకు శాంతకుమారి కుప్పకూలిపోయింది. అక్క చింతామణి, మిగతా కూలీలు ఆమె దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది.

ఇదీ చదవండి: ఐసీయూలో​ ఆగిన విద్యుత్.. కరోనా రోగుల ఉక్కిరిబిక్కిరి

శాంతకుమారి భర్త వెంకటస్వామి ఐదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ కుమారుడు, కూమార్తెను పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె మృతితో పిల్లలిద్దరూ దిక్కులేని వారయ్యారు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

తండ్రి ఫోన్ మాట్లాడొద్దన్నాడని.. బాలిక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.