కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను... లారీ వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో... ఇంజిన్ నుంచి డీజిల్ లీకై క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పూర్తిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో... వరిగడ్డితో సహా ట్రాక్టర్ దగ్ధమైంది. జాతీయ రహదారి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. నంద్యాల నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరిగడ్డి రుద్రవరం మండలం ఎర్ర గుడి దీన్నే గ్రామానికి చెందిన గోపి రెడ్డి కాగా.. ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని భాధిత రైతు వాపోతున్నారు.
ఇదీ చదవండి:
చనిపోయాడని అంత్యక్రియలు చేశారు... తిరిగొచ్చాక ఆశ్చర్యపోయారు..!