కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని సంగమేశ్వరం... తుంగభద్ర పుష్కరాలకు ముస్తాబైంది. అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రయాణీకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ.40 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బంది ఏర్పాట్లు చేశారు. సంగమేశ్వరాలయాన్ని విద్యుద్ధీపాలతో అందంగా అలంకరించారు.
ఇదీచదవండి