కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని విద్యుత్ ఉపకేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే 132 వేల కిలో వాట్ల సామర్థ్యం ఉన్న తీగ జంపర్ తెగిపోయింది. ఈ సమయంలో మరమ్మతులు చేయాలంటే తప్పనిసరిగా విద్యుత్‌ను నిలిపివేయాల్సిందే. అలా చేస్తే విద్యుత్ సంస్థకు లక్షల రూపాయల మేరనష్టం వాటిల్లుతుంది. ఈ నష్ట నివారకు చర్యలు చేపట్టిన విద్యుత్ అధికారులు.. విదేశాల నుంచి 5 లక్షలు వెచ్చించి ప్రత్యేక దుస్తులను తెప్పించారు.మరో 30 లక్షలు ఖర్చుచేసి ప్రత్యేక నిచ్చెన ద్వారా బేర్ హ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి మరమ్మతులు చేపట్టారు. అంత తీవ్రతతో విద్యుత్ సరఫరా అవుతున్నా... ఈ ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా మరమ్మతులు చేయగలిగామని విద్యుత్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: