కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక విత్తనాల దుకాణంలో చోరీ జరిగింది. పట్టణంలోని టీబీ రోడ్డు వద్ద ఉన్న అన్నదాత వ్యవసాయ విత్తనాల దుకాణంలో లక్ష రూపాయల నగదు దొంగతనానికి గురైంది. ఈ ఘటనపై యజమాని హరికృష్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక అగంతకుడు దుకాణం తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించి చోరీ చేస్తుండటం కనిపించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి: