కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో చోరీ జరిగింది. పట్టణంలోని రోజాకుంట పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి జగనన్న విద్యాకానుకకు చెందిన కొన్ని కిట్లను అపహరించారు.
పుస్తకాలు మాయం చేశారు. పాఠశాలలో 75 మంది విద్యార్థులు ఉండగా 35 మందికి చెందిన పుస్తకాలు అపహరించారు. పాఠశాల ఆవరణలో కొన్ని పుస్తకాలు వదిలి వెళ్లారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: