ETV Bharat / state

నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్​పై నడక.. యువకుడు మృతి

author img

By

Published : Jun 23, 2021, 9:07 PM IST

చిన్నపాటి నిర్లక్ష్యం.. ఓ యువకుడి నిండు ప్రాణం బలికొంది. చెవిలో ఇయర్​ ఫోన్స్ పెట్టుకుని రైల్వేట్రాక్​పై నడుస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవటమే ప్రాణాలు పోవడానికి కారణమైంది. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో పొన్నాపురం వద్ద ఈ ఘటన జరిగింది.

The young man died
మృతి చెందిన యువకుడు

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో పొన్నాపురం వద్ద రైలు ఢీకొని మనోహర్ (22) అనే యువకుడు మరణించాడు. రైల్వే ట్రాక్​పై వెళ్తుండగా వెనుక నుంచి రైలు ఇంజన్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు నడిపే వ్యక్తి హారన్​ కొట్టి ఆ యువకుడిని అప్రమత్తం చేయాలని ప్రయత్నించినా.. అతను చెవిలో ఇయర్​ ఫోన్స్​ పెట్టుకోవటం వల్ల వినిపించుకోలేకపోయాడు.

రైల్వే ట్రాక్​ వద్ద యువకుడు జాగ్రత్తగా ఉండి ఉంటే ప్రమాదం నుంచి బయటపడేవాడు. అతని నిర్లక్ష్యానికి ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు కడప జిల్లా బద్వేల్​కు చెందినవాడిగా గుర్తించామన్నారు. ఇటీవల బీటెక్​ పూర్తి చేసి, బ్యాంకు కోచింగ్​ కోసం నెల రోజుల క్రితమే నంద్యాలలోని ఓ ఇనిస్టిట్యూట్​లో చేరినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: కర్నూలులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.