తుంగభద్ర నది పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని ప్రధాన పుష్కర ఘాట్ సంకల్ భాగ్‌లో ఉదయం స్నానాలు చేసేందుకు భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. నదిలో స్నానం చేసి పుజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో... పుష్కర స్నానాలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చుపడం లేదు.
తుంగభద్ర నదిలో నీటి మట్టం మంగళవారం పెరిగింది. గత నాలుగు రోజులుగా భక్తులు నదిలో దీపాలు వెలిగించి వదిలేందుకు కూడా నీరు ఉండేది కాదు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుంగభద్ర అధికారులు నదికి నీరు వదలడంతో....జలకళ సంతరించుకుంది.
ఇదీ చదవండి: