కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టు పక్కనున్న గృహ సముదాయాలను సీపీఎం నేతల బృందం పరిశీలించింది. కరోనా పరిస్థితుల్లో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలను వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని వారు కోరారు. అసంపూర్తిగా ఉన్న గృహాలను నిర్మించాలని కోరారు.
ఇదీ చదవండి శ్రీశైలానికి స్థిరంగా వరద.. 842.4 అడుగులకు చేరిన నీటిమట్టం