కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లిలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలి బాలుడు మరణించాడు. బంధువుల వివాహానికి యశ్వంత్ కర్ణాటక నుంచి కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చాడు. రాత్రి వర్షం కుండపోతగా కురవటంతో మిద్దె కూలి పోవడంతో యశ్వంత్ అక్కడికక్కడే చనిపోయాడు. పిల్లాడి కోసం తల్లిదండ్రులు గాలించగా కూలిన ఇంట్లో మృతి చెంది ఉన్నాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మొలగవల్లిలో విషాదం... భారీ వర్షానికి ఇల్లు కూలి బాలుడు మృతి - కర్నూలు జిల్లా లేటెస్ట్ వార్తలు
కర్నూలు జిల్లా మొలగవల్లిలో విషాదం నెలకొంది. వర్షం జోరుగా కురవటంతో మిద్దె కూలి అక్కడికక్కడే యశ్వంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మొలగవల్లిలో విషాదం... భారీ వర్షాలకు ఇల్లు కూలి బాలుడు మృతి
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లిలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలి బాలుడు మరణించాడు. బంధువుల వివాహానికి యశ్వంత్ కర్ణాటక నుంచి కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చాడు. రాత్రి వర్షం కుండపోతగా కురవటంతో మిద్దె కూలి పోవడంతో యశ్వంత్ అక్కడికక్కడే చనిపోయాడు. పిల్లాడి కోసం తల్లిదండ్రులు గాలించగా కూలిన ఇంట్లో మృతి చెంది ఉన్నాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి- చూస్తుండగానే..వాగులో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి