కర్నూలు జిల్లా రుద్రవరం మండలం హరి నగరం వద్ద నీటి గుంతలో పడి ఒక బాలుడు మృతి చెందాడు. హరి నగరంలో నివాసం ఉంటున్న భాస్కర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెని కడప జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన సోమిరెడ్డి ఇచ్చి వివాహం చేశాడు. రెండో కుమార్తెను కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శివకుమార్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు. ఇటీవల ఇద్దరు కుమార్తెలు పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వచ్చారు. ఇద్దరు కుమార్తెల పిల్లలు నవదీప్ కుమార్ రెడ్డి(13), వర్ధన్ కుమార్ రెడ్డి, మోక్షిత రెడ్డి బుధవారం తన తాత భాస్కర్ రెడ్డి ఇంటి సమీపంలోని నీటి గుంతలో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు నీటి గుంతలో పడగా స్థానికులు రక్షించారు. చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో నవదీప్ కుమార్ రెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో మృతదేహాన్ని వారి సొంత ఊరు జంగాలపల్లికి తీసుకొని వెళ్లి ఖననం చేశారు
ఇవీ చదవండి