ఇవీ చూడండి.
అన్న కోసం చెల్లెలు... విజయం కోసం సోదరుడు - ap elections 2019
కర్నూలు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ సోదరితో కలిసి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ గెలిపించాలని కోరారు. కర్నూలు అభివృద్ధి కోసం తను ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికను ప్రజలకు వివరించారు.
సోదరితో కలిసి ప్రచారం చేసిన కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కర్నూలు అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో భరత్ సోదరి మౌర్య ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు కుంకుమ పెట్టి అన్నను గెలిపించాలని కోరారు. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి ఎందుకు మారుతున్నారని ఓ మహిళ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పార్టీలు మారే సంస్కృతి టీజీ వెంకటేశ్ కుటుంబానికి లేదని పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి భరత్ అన్నారు.
ఇవీ చూడండి.
sample description
Last Updated : Mar 25, 2019, 5:28 PM IST