ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్ లో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించినట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. మరో కేసులో ఆదోనిలోని దర్గాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు.
అదే పట్టణంలోని కొండపై మతపరమైన ప్రాంతాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాసిన కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ప్రార్ధనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ఇలాంటి కేసుల విషయంలో రాజకీయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: