'నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు' - తెలుగుగంగ ప్రాజెక్టు
తమ పొలాలకు నీటి సరఫరా చేసే కాలువ నుంచి ఎగువన కొందరు నీటిని అక్రమంగా వాడుకుంటున్నారని కర్నూలు జిల్లా మహానంది మండలం నందిపల్లె రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై వారు నంద్యాల తెలుగుగంగ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోహర్ రాజును కలసి సమస్యను విన్నవించారు. తెలుగుగంగ 11వ బ్లాక్ నుంచి అక్రమంగా గండి కొట్టి ...తమ్మడపల్లి గ్రామస్థులు చెరువు నింపుకుంటున్నారని వారు ఆరోపించారు. అధికారికంగా ఎలాంటి అనుమతి లేకుండా నీరు ఎలా వాడుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు గంగ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోహర్ రాజు
By
Published : Feb 3, 2020, 1:39 PM IST
.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోహర్ రాజుతో మాట్లాడుతున్న రైతులు