రాష్ట్రానికి తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. చిన్న ట్రాలీలో టమాటాలతో పాటు తరలిస్తున్న 44 బాక్సుల్లోని 2,027 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన ఒకరు, తుగ్గలి మండలం శభాష్పురానికి చెందిన మరొకరిని అరెస్టు చేశామని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: వైకాపా కార్యాలయం కాదోయ్...శివాలయమే..!