వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలను, రైతులను, కార్మికులను అన్నివిధాలుగా మోసం చేసిందని.. మాజీమంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ విమర్శించారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ, అనుబంధ రంగాల కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనుల్లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపే ప్రసార మాధ్యమాలపై కేసులు పెడతాననడం అవివేక చర్యగా అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరనీ.. ప్రజలకు నష్టం చేసి తాము లాభం పొందాలని చూస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
ఇవీ చదవండి..