ETV Bharat / state

పడిపోయిన టమాటా ధరలు..కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదని రైతుల ఆవేదన

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన మద్దతు ధర రాలేదు. కనీసం పంటపై పెట్టిన పెట్టుబడి సైతం దక్కలేదు. స్పందించి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులూ ఏం చేయలేకపోయారు. చేసేదేమీ లేక నెలలపాటు శ్రమించి పండించిన పంటను రైతులు నేలపాలు చేశారు. ఇదీ కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని రైతుల దుస్థితి.

author img

By

Published : Dec 23, 2020, 9:55 PM IST

Updated : Dec 23, 2020, 10:39 PM IST

tamato Prices down in Pattikonda market
అత్యల్ప స్థాయికి టమాట ధరలు..
పడిపోయిన టమాటా ధరలు.

కర్నూలు జిల్లా పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు ఇవాళ అత్యల్ప స్థాయికి పడిపోయాయి. వారం రోజులుగా కిలో టమాటా ధర రూపాయి లేదా అంతకంటే తక్కువగానే ఉంటోంది. టమాటా ధర అంత తక్కువ స్థాయికి పడిపోవడం వల్ల అక్కడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా మార్కెటింగ్‌ శాఖ, ప్రాంతీయ స్థాయి అధికారులు పత్తికొండ మార్కెట్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ధరలపై స్థానిక వ్యాపారులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నష్టపోకుండా సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.

అధికారులు మార్కెట్‌ను పరిశీలించి 24గంటలు గడవకముందే టమాటా ధరలు మరింతగా పడిపోయాయి. దీంతో కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడం వల్ల ఆవేదనకు గురైన రైతులు.. తాము తీసుకొచ్చిన టమాటాలను మార్కెట్‌ యార్డు ఆవరణలోనే కింద పారబోసి నిరసన వ్యక్తం చేశారు. తాము తీవ్ర నష్టాలు చవిచూసున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఈ నెల 29న రైతులకు తుపాను పరిహారాన్ని అందిస్తాం: కన్నబాబు

Last Updated : Dec 23, 2020, 10:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.