ETV Bharat / state

నంద్యాల విలేకరి హత్య కేసు..కానిస్టేబుల్​ వెంకటసుబ్బయ్య, నాని అరెస్టు - కర్నూల్​ జిల్లా సమాచారం

నంద్యాలలో యూట్యూబ్‌ ఛానెల్‌ విలేకరి హత్య కేసులో కానిస్టేబుల్​ వెంకటసుబ్బయ్య(సస్పెండ్​​)తో పాటు అతని సోదరుడు నానిని పోలీసులు అరెస్టు చేశారు. తాను సస్పెండ్​ కావడానికి కారణం ఆ విలేకరేనని భావించిన వెంకటసుబ్బయ్య అతనిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

నంద్యాల విలేకరి హత్య
నంద్యాల విలేకరి హత్య
author img

By

Published : Aug 10, 2021, 8:34 PM IST

Updated : Aug 10, 2021, 8:47 PM IST

కర్నూల్​ జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ ఛానెల్‌ విలేకరి హత్య కేసులో కానిస్టేబుల్​ వెంకటసుబ్బయ్య(సస్పెండెడ్​)తో పాటు అతని సోదరుడు నానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ సబ్‌ జైలుకు తరలించారు. ఈ నెల 23 వరకు రిమాండ్​ విధించారు.

వెంకటసుబ్బయ్య
వెంకటసుబ్బయ్య
నాని
నాని

నంద్యాల ఎన్జీవో కాలనీలో కేశవ్‌ అనే వ్యక్తి నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి వీపుపై రక్త గాయాలు ఉన్నాయి. మృతుడు కేశవ్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్​కు విలేకరిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటసుబ్బయ్య అనే కానిస్టేబుల్​ పాటు, మరో వ్యక్తి కలిసి కేశవ్​ను ఓ హోటల్ వద్దకు రమ్మని పిలిచారు. అక్కడకు వెళ్లిన వెంటనే కేశవని​ స్క్రూ డ్రైవర్​తో పొడిచి దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

వెంకటసుబ్బయ్య నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్​లో కానిస్టేబుల్​గా పని చేసేవాడు. ఇటీవల అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్​కు గుట్కా వ్యాపారితో సంబంధం ఉందన్న వ్యవహారంలో ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు అతడిని విధుల నుంచి సస్పెండ్​ చేశారు. దీనికి కారణం కేశవ్ అనిన భావించిన పోలీసు సుబ్బయ్య.. కక్షతో విలేకరిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Murder: నంద్యాలలో విలేకరి దారుణ హత్య.. పోలీసే హంతకుడా ?

Last Updated : Aug 10, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.