ETV Bharat / state

హాస్టళ్లు తెరవాలని విద్యార్థులు ఆందోళన - Students protest under sfi news update

విద్యాసంస్థలు ప్రారంభించిన తరహాలోనే హాస్టళ్లు ప్రారంభించాలని కర్నూలులో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఇబ్బంది అవుతున్న తరుణంలో త్వరగా హాస్టళ్లు ప్రారంభించాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్ చేశారు.

Students protest for hostels opening
హస్టళ్లు తెరవాలని విద్యార్ధులు ఆందోళన
author img

By

Published : Nov 30, 2020, 3:28 PM IST

ప్రభుత్వ హాస్టళ్లను ప్రారంభించాలని కర్నూలులో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు ధర్నా చేశారు. ఖాళీ కంచాలు చేత పట్టుకొని నిరసన తెలిపారు. కరోనా నివారణ చర్యలు తీసుకుంటూ.. విద్యాసంస్థలు ప్రారంభించిన తరహాలోనే హాస్టళ్లు ప్రారంభించాలని కోరారు. వసతి గృహాలు ప్రారంభం కాకపోవటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి హాస్టళ్లను ప్రారంభించాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్నాన్ని, అధికారులను హెచ్చరించారు.

ఇవీ చూడండి...

'వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్యకళాశాల వద్దు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.