కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని పౌల్ట్రీ ప్రాథమిక పాఠశాలకు.. దారి లేక ఇబ్బందిగా మారింది. ఈ బడికి వెళ్లాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రహరీ దూకాల్సిందే. 2004లో నిర్మించిన పాఠశాలకు తూర్పు, ఉత్తర దిశ వైపు రాకపోకలకు రహదారులు ఉండేవి. పాఠశాలకు స్థలం దానం చేసిన దాత తూర్పువైపున ఉన్న తన స్థలాన్ని ఇతరులకు విక్రయించగా.. స్థలం కొన్న వ్యక్తి తూర్పు వైపు రహదారిని మూసివేశారు. ఉత్తరం వైపున ఉన్న రహదారిని రైతులు మూసివేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: