ETV Bharat / state

తుంగభద్ర తీరాన ఇసుక కూలీల బతుకు పోరాటం - problems of sand workers in kurnool district

కొందరిది బతుకు పోరాటమైతే ...! మరికొందరిది వ్యాపారం...! తరతరాలుగా నదినే నమ్ముకుని పలువురు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జీవనం సాగిస్తున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి దళారులు లాభాలు ఆర్జిస్తున్నారని... వచ్చింది కాస్త పోలీసులు దండుకుంటున్నారని కర్నూలు జిల్లా తుంగభద్ర నదీ పరిహహక ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

sand kurnool
sand kurnool
author img

By

Published : Nov 3, 2020, 5:19 PM IST

Updated : Nov 4, 2020, 3:31 PM IST

తుంగభద్ర తీరాన ఇసుక కూలీల బతుకు పోరాటం

కర్నూలును ఆనుకుని తుంగభద్ర నది ప్రవహిస్తోంది. నదిలోని ఇసుకను అమ్ముకుని పరివాహక ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. ఇసుకను ఆన్​లైన్ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి రావటంతో అది కూడా పరిమితంగానే దొరుకుతోందని...ఫలితంగా ఇసుక కొరత తీవ్రంగా ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు..

కూలీల ఆవేదన...

తుంగభద్ర నదిలో కనుచూపు మేర ఇసుకను తవ్వితీసే వారే దర్శనమిస్తారు. నీరు బాగా ప్రవహించే సమయంలో ప్రమాదమని తెలిసినా పూర్తిగా నీటిలో మునిగి... ఇసుక ఎక్కడుందో గుర్తించి తవ్వి తీస్తున్నామని చెబుతున్నారు. నోటి దగ్గర కూడు తన్నుకుపోయినట్లు.... అంత కష్టపడి ఇసుకను తెస్తుంటే...పోలీసులు ఆపి జరిమానాలు విధిస్తున్నారని వాపోతున్నారు. కొందరు యజమానులు యువకులకు కూలీ ఇచ్చి లాభాలు ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.

నదిలో అనుకోకుండా వచ్చే ఆటుపోట్ల వల్ల ఒక్కోసారి ప్రమాదం పొంచి ఉంటున్నా.. కుటుంబ పోషణకు తప్పటం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

Last Updated : Nov 4, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.