ఆదివారం సూర్యగ్రహణం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లన్న ఆలయాన్ని శనివారం రాత్రి 10 గంటలకు మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అ తర్వాత మంగళహారతులు , కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా దర్శనలు కల్పించనున్నారు.
మహానందిలోనూ...
సూర్యగ్రహణం కారణంగా కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద శైవక్షేత్రం మహానంది ఆలయాన్ని ఆదివారం మూసివేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు మూసివేసి ఆ తర్వాత సంప్రోక్షణ చేసి అలయాన్ని తెరుస్తారు.