ETV Bharat / state

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం రథోత్సవం - Srisailam temple in Kurnool district latest news

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు కళాకారుల నృత్య కేళి నడుమ ప్రభోత్సవం జరిగింది. సాయంత్రం నంది వాహనంపై గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. లింగోద్భవ సమయాన హృదయ నివాసుడైన శ్రీశైలేశుని పాగాలంకరణను కనులారా వీక్షించేందుకు శివ స్వాములు, భక్తులు పోటీ పడ్డారు.

Srisailam
Srisailam
author img

By

Published : Mar 12, 2021, 8:44 AM IST

Updated : Mar 12, 2021, 9:22 AM IST

శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి సంప్రదాయాన్ని అనుసరించి మల్లన్నకు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అన్ని విద్యుద్దీపాలను ఆర్పివేసి మల్లన్న ఆలయ విమాన గోపురానికి, ముఖమండప నందులకు పాగాలంకరణ చేపట్టారు. పృథ్వీ వెంకటేశ్వర్లు చూడముచ్చటగా, మల్లన్నను పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసినట్లు పాగాలంకరణ చేశారు. పాగాలంకరణ ముగిసిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండపంలో భ్రమరాంబ, మల్లికార్జునుల బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మాండంగా సాగింది.

Srisailam temple
అఖిలాండం.. బ్రహ్మాండం.. ముక్కంటి స్మరణతో మురిసిన భక్తకోటి

శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ తదితర పరమ పవిత్ర క్షేత్రాల్లో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ముక్కంటిని తనివితీరా స్మరించి.. శుభాలు కలిగించాలని భోళా శంకరుడిని వేడుకున్నారు.

ప్రభోత్సవంలో అశేష భక్తజనం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తొమ్మిదో రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆదిదంపతులకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్న సీఎం జగన్‌

Last Updated : Mar 12, 2021, 9:22 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.