ETV Bharat / state

శ్రీశైలం దేవస్థానంలో పొరుగుసేవల సిబ్బంది అక్రమాలు - శ్రీశైల దేవస్థానంలో పొరుగుసేవల సిబ్బంది అక్రమాలు

దేవస్థానాల్లో పొరుగుసేవల విధానం అసలుకే ఎసరు పెడుతోంది. పొరుగు సేవల్లో పాల్గొనే ప్రైవేటు సిబ్బందిలో బాధ్యత కొరవడుతోంది. ఫలితంగా దేవస్థానానికి చెందాల్సిన ఖజానా పక్కదారి పడుతోంది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు దేవాదాయశాఖ ప్రవేశపెట్టిన పొరుగుసేవల సంస్కరణలు వరుసగా బెడిసికొడుతున్నాయి. శ్రీశైలం దేవస్థానంలో పొరుగుసేవల సిబ్బంది పాల్పడుతున్న అక్రమాలపై ప్రత్యేక కథనం.

Srisailam
Srisailam
author img

By

Published : May 29, 2020, 9:37 PM IST

రాష్ట్ర దేవాదాయశాఖ 2002 నుంచి దేవాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగాల నియామకంపై నిషేధం విధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానాల్లో పొరుగు సేవలకు పెద్దపీట వేస్తున్నారు. పొరుగు సేవల విధానం ద్వారా నియామకం అయ్యే సిబ్బందిలో బాధ్యత కొరవడడం, తక్కువ వేతనాలతో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.

శ్రీశైలం దేవస్థానంలో... పొరుగు సేవల్లో పనిచేసే సిబ్బందికి టిక్కెట్లు జారీ, నగదు సేకరణ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

శ్రీశైలం దేవస్థానం పరిధిలో... లడ్డు, దర్శనం, టికెట్ విక్రయ కేంద్రాలను స్థానికంగా ఉన్న రెండు ప్రధాన బ్యాంకులకు అప్పగించారు. సదరు బ్యాంకులు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నడిపే ఏజెన్సీల ద్వారా సిబ్బందిని నియమించుకున్నారు. ఈ క్రమంలో 2010లో లడ్డు విక్రయ కేంద్రంలో 10 లక్షల రూపాయలు స్వాహా చేసిన పొరుగు సేవల సిబ్బంది ఉదంతాన్ని స్థానిక ఆడిట్ అధికారులు గుర్తించారు.

అంతే కాకుండా లడ్డు బరువు తగ్గించి చేస్తున్న అక్రమాలు గుర్తించారు. ఇలా అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఆర్జిత సేవా టికెట్ కౌంటర్లు, పెట్రోల్ బంక్, విరాళాల కేంద్రం, వసతి సముదాయాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది రూపాయల స్వామివారి సొమ్మును పక్కదారి పట్టించారు.

ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కోల్పోతామన్న భయం కారణంగా... రెగ్యులర్ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. పొరుగుసేవలకు ఎలాంటి భయాందోళనలు లేకపోవటంతో... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.