శ్రీశైలం దేవస్థానంలో తన బంధువులు లేరని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దేవస్థానంలో జరిగిన అక్రమాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. టికెట్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ చేయించాలని కోరినట్లు స్పష్టం చేశారు.
ఈ విషయంపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌తో పాటు, కర్నూలు ఎస్పీ ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీతో ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశంతోనే భాజపా నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి : మహానాడు 2020 విజయవంతం : కాల్వ శ్రీనివాసులు