శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద.. బాధితులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జీవో నెంబర్ 98 ప్రకారం ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. అవుట్ సోర్సింగ్‌లో లష్కర్ ఉద్యోగాలు ఇచ్చి, తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లష్కర్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి: