కృష్ణా పరివాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది. జలాశయంలోకి 2లక్షల 27వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా....97వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 207.84 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,648 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా....ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2వేల 400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2 వేల ,26 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 24 వేల 500 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు.
ఇది కూడా చదవండి.