శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. సుంకేసుల నుంచి 5,10,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేశారు. ఫలితంగా.. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,65,040 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884 అడుగులు ఉండగా..,నీటి నిల్వ సామర్థ్యం 210 టీఎంసీలుగా నమోదైంది.
ఇదీ చదవండి:
అలర్ట్ : రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు