శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆమెకు ఆలయ ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. శ్రీశైలం సమీపంలోని లింగాల గట్టు సమీపంలో అటవీశాఖ ప్రొటెక్షన్ వద్ద 115 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం, కిరాణా సరకులు అందజేసి... తన సేవా భావాన్ని చాటుకున్నారు.
మాస్కు ధరించి వచ్చిన ఆమె... స్వామివారి దర్శనం అనంతరం సిబ్బందికి నమస్కరిస్తూ తిరిగి వెళ్లారు. ఆమెతో స్థానిక ఉద్యోగులు కొందరు ఫొటోలు దిగారు. ఉపాసన తరచూ శ్రీశైలం వస్తుండగా... లాక్డౌన్ సడలింపు ఇవ్వగానే ఆమె దర్శనానికి రావడం విశేషం.
ఇదీ చదవండి: ఆ సినిమాలో వర్షం సీన్ల కోసం ఆరేళ్లు షూటింగ్!